కుటుంబ సభ్యులతో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
కొమురవెల్లి, అక్షిత న్యూస్:
కార్తీక మాసం ను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి కుటుంబ సభ్యుల తో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు వేదపండితులు కలెక్టర్ కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి తీసుకెళ్లి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వేదపండితులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వచ్చే నెలలో జరిగే శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం మరియు ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్ల గూర్చి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.