తెలంగాణ సంస్కృతిని మరిచిన కాంగ్రెస్ సర్కార్
నంగునూరు, అక్షిత ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిని సంప్రదాయన్నీ మర్చిపోయిందని రాంపూర్ బిఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు యం డి విమర్శించారు. పండుగ లేదు పబ్బం లేదు ఇప్పుడు తెలంగాణ మహిళలకు చీరలు ఇవ్వాలని ఆలోచన ఎలా వచ్చింది ఇది అంతా కూడా స్థానిక ఎన్నికల కోసం ఆడే డ్రామా అన్నారు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి అలాంటి పండుగలకు ఇవ్వని మహిళలకు ఇప్పుడు చీరలు అందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి అసలే లేదు. చీరలు మాత్రం గుర్తుకుంది కాంగ్రెస్ ప్రభుత్వనికి మా బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రతి మహిళ ప్రతి బతుకమ్మ పండుగకు సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని కలగజేసాము. ఇప్పుడు మహిళలకు చీరలు అందిస్తే ఏమి ఉపయోగం ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ముమ్మాటికి ఇది స్థానికలు ఎన్నికల కోసం డ్రామా అని కరాకండిగా వాదించారు. ప్రతి మహిళకు 2500 ఏమైంది. యం డి గఫూర్ మరోసారి గుర్తు చేశారు. ప్రతి మహిళకు సంఘాలతో సంబంధం లేకుండా లేకుండా ఇంటిలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు షరతులు లేకుండా చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.