చిన్న పత్రికలకు అండగా ఉంటా

చిన్న పత్రికలకు
అండగా ఉంటా

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా
“విజయ” కేతనం

విజయ్ కుమార్ రెడ్డికి
ఘన సత్కారం

పెండింగ్ బిల్లులు విడుదల
చేసి పత్రికలను ఆదుకోవాలి

భట్టి, ఉత్తమ్, కమీషనర్
ప్రియాంకలకు వినతి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

చిన్న పత్రికలకు అండగా ఉంటానని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిగిరి విజయ్ కుమార్ రెడ్డి భరోసా కల్పించారు. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యల సాధనకు తమ వంతు కృషి చేస్తానన్నారు. సోమవారం తెలంగాణ చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగిల ఆధ్వర్యంలో విజయ్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) బలపర్చిన నేతలు విజయకేతనం ఎగుర వేసిన విషయం విదితమే. సీనియర్ జర్నలిస్ట్ గా, జర్నలిస్టులకు పెద్దన్నగా చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

చిన్న పత్రికల ఎడిటర్లకు ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు, ఇతర సమస్యలను ప్రస్తావించడంతో సానుకూలత వ్యక్తం చేశారు. సంఘం ఆధ్వర్యంలో విజయ్ కుమార్ రెడ్డికి తొలుత శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు షేక్ అహ్మద్ అలీ, వెన్నమల్ల రమేష్ బాబు, కొమరాజు శ్రీనివాసులు, వేమిరెడ్డి సుభాష్ రెడ్డి, కోటగిరి చంద్రశేఖర్, ఎండి మక్సుద్ వేముల వెంకటేశ్వర్లు, పెద్దగోరి మధు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు ఇప్పించాలి
భట్టి, ఉత్తమ్ లకు వినతి

చిన్న మధ్య తరహా పత్రికలకు ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న ప్రకటనల బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంకలకు ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర నాయకుల బృందంతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో చిన్న పత్రికల మనుగడ కష్టతరంగా మారిందన్నారు. ఆయా బిల్లులను సకాలంలో విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. అందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking