దొంగలమర్రి సమీపంలో దుర్వాసన
*ఇబ్బందుల్లో వాహనదారులు
కొడిమ్యాల, అక్షితన్యూస్ :
జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారిలోని కొడిమ్యాల మండలం దొంగలమర్రి పోలీసు చెక్ పోస్ట్ సమీపంలోని అటవీ(గుట్ట)ప్రాంతంలో గత 10 రోజుల నుండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు దుర్వాసనకు గల కారణాలను తెలుసుకొని దుర్వాసన నుండి విముక్తి కల్గించాలని కోరుతున్నారు.