సోనియమ్మా తెలంగాణ నిను మరువదమ్మా !

సోనియమ్మా తెలంగాణ

నిను మరువదమ్మా !

షాద్ నగర్ ఎమ్మెల్యే
“వీర్లపల్లి శంకర్”

షాద్ నగర్ లో సోనియాగాంధీ
జన్మదిన వేడుకలు

షాద్ నగర్, అక్షిత న్యూస్ :

4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ.. అప్పటి కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్న సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు ఎమ్మెల్యే తినిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న సోనియాగాంధీ నాయకత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన రోజు ఇదేనని అన్నారు.

4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారని అన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించామని, నేడే సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాయని, తెలంగాణ అభివృద్ధి వైపు పురోగమిస్తోందని ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, అగ్గనూర్ బస్వం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, ముబారక్, అర్జున్ లక్ష్మణ్, బచ్చలి నరేష్, ప్రవీణ్, మహమ్మద్ ఇబ్రహీం, జాఫర్, మున్నా, వెంకట్ రెడ్డి, రాజు నాయక్, దాకం మనీష్, చిన్న, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking