కదం తొక్కిన
కలం దండు
మోగించిన
అక్షర దండోరా
గర్జించిన జర్నలిస్టులు
డైరెక్టర్ జగన్ కు
సమస్యల తోరణం
మహా ధర్నా
గ్రాండ్ సక్సెస్
ఐజేయూ మాజీ
అధ్యక్షులు అమర్,
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి రాoనారాయణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కలం దండు కదం తొక్కింది. నినాదాలు హోరెత్తాయి. కలం కార్మికులు గర్జించారు. ఐదు ప్రధాన డిమాండ్లతో కూడిన సమస్యల తోరణం ఐఅండ్ పిఆర్ ఇంచార్జీ డైరెక్టర్ జగన్ కు చేరింది. కొత్త అక్రిడిటేషన్, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, చిన్న మధ్య తరహా పత్రికలకు పెండింగ్ బిల్లులు, అప్ గ్రేడ్, కొత్త ఎంపానల్ మెంట్ తదితర అంశాలపై జర్నలిస్టులు గొంతెత్తారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అధ్యక్షతన చేపట్టిన జర్నలిస్టుల మహా ధర్నా అక్షర దండోరా మోగించింది. చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి ఆధ్వర్యంలో చేపట్టిన బుల్లెట్ బైక్ ర్యాలీ కొత్తపేట నుంచి ఐఅండ్ పిఆర్ కార్యాలయం వరకు సాగింది.

సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. పుష్కర కాలంగా పెండింగ్ లో
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇది ఓ ట్రయల్ మాత్రమే ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ఐజేయూ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాoనారాయణలు హెచ్చరించారు.

పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహా ధర్నా అనూహ్య రీతిలో విజయవంతం అయ్యింది.

టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి ఎంతో ఉత్సాహంగా, భారీగా జర్నలిస్టులు తరలి రావడం విశేషం. జర్నలిస్టుల నినాదాలతో మహానగరం రోడ్లన్నీ దద్దరిల్లాయి. సమాచార శాఖ చరిత్రలో, ఆ కార్యాలయం వద్ద ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ధర్నా చేయడం ప్రప్రథమని పోలీసు అధికారులతో సహా పలువురు సీనియర్ పాత్రికేయులు చర్చించుకోవడం విశేషం.

ఈ మహా ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్యలతో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ, జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ, టీజేఏలు సంపూర్ణ మద్దతును ప్రకటించి మహా ధర్నాలో భాగస్వామ్యమయ్యాయి.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, నగునూరి శేఖర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
విజయ్ కుమార్ రెడ్డి, రమేష్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కెఎన్ హరి, వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, హరీష్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, యూనియన్ రాష్ట్ర నాయకులు వి.యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి, మధు గౌడ్, ఫైసల్, హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ.రాజేష్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి ఈ మహా ధర్నాలో వయోదిక జర్నలిస్టుల సంక్షేమ సంఘం కూడా భాగస్వామ్యం అయ్యింది.

ఆ సంఘం నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉర్దూ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్, సీనియర్ మహిళా జర్నలిస్టులు విమల, అత్తలూరి అరుణ, వాకటి మంజుల, కళ్యాణం రాజేశ్వరీ తదితరులు మాట్లాడారు. ఈ మహా ధర్నాలో సీనియర్ జర్నలిస్టులు కోటగిరి దైవాదీనo, అహ్మద్ అలీ, మక్సుద్, సుభాష్ రెడ్డి, కొమర్రాజు శ్రీనివాస్, సంద్యాల, వి. రమేష్ బాబు, వేముల వెంకటేశ్వర్లు, సోమారపు యాదయ్య, రాజు , రాజు యాదవ్, కూరెళ్ళ శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.