ఎక్లాస్ ఖాన్ పేటలో డబ్బుల హల్చల్

 

ఎక్లాస్ ఖాన్ పేటలో డబ్బుల హల్చల్

*డబ్బుల పంపిణీ కోసం వచ్చిన షాద్ నగర్ బిఆర్ఎస్ యువ నాయకులు*

*గమనించిన స్థానికులు.. తిరగబడ్డ జనం*

*ఎమ్మెల్సీ అనుచరులుగా గుర్తింపు*

*ఎమ్మెల్సీ నవీన్ అనుచరులకు దేహశుద్ధి*

*రెండు వాహనాలు ధ్వంసం*

*కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు*

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి :

షాద్ నగర్ బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి పశువుల ప్రవీణ్ కోసం డబ్బులు తరలిస్తున్న నేపథ్యంలో సదరు వాహనాలను స్థానికులు అటకాయించి వారిపై దాడికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో చోటుచేసుకుంది. పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పశువుల ప్రవీణ్ అనే వ్యక్తిని గ్రామంలో ఎన్నికల సందర్భంగా మద్దతు ఇచ్చి నిలబెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల చివరిరోజైన బుధవారం రాత్రి గ్రామంలోకి రెండు వాహనాలు ప్రవేశించడంతో స్థానికులు, పోటీదారులు ఈ వాహనాలపై దృష్టి సారించారని తెలుస్తుంది.

వాహనాలలో స్థానికులకు చిక్కిన వారిలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు దినేష్ సాగర్, సుధీర్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. స్థానికులు వీరిపై ఆగ్రహంతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు సకలలు చేరుకోకపోతే తీవ్ర సంఘటనగా మిగిలేది. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానికులు చెప్పిన విధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో పశువుల ప్రవీణ్ అనే వ్యక్తిని బలపరిచి పోటీకి నిలబెట్టిన సందర్భంగా రాత్రికి ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిపిద్దామని ఆలోచించి వారి అనుచరులతో డబ్బులు పురమాయిస్తుండగా
స్థానికులు గ్రామంలో వీరిని వెంబడించి పట్టుకున్నట్టు సమాచారం.

అయితే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుచరులు దినేష్ సాగర్ మధుసూదన్ రెడ్డి సుధీర్ తదితరులను గ్రామస్తులు పట్టుకుని వాహనాలను ధ్వంసం చేసి వారిపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక బిఆర్ఎస్ నాయకులు మాత్రం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను రాజకీయంగా టార్గెట్ చేసి కాంగ్రెస్తో కుమ్మక్కై గ్రామంలో కోటి రూపాయలు పంపకానికి ఎమ్మెల్సీ సిద్ధమయ్యాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి ఎలుగునమోని హరి శేఖర్ కాలు కూడా తీవ్రంగా గాయమైనట్టు ప్రాథమిక సమాచారం అందుతుంది. వాహనాలలో డబ్బులు పెట్టుకుని అత్యంత వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించడం ఈ సందర్భంగా అడ్డంగా వెళ్లిన సర్పంచ్ అభ్యర్థి హరి శేఖర్ వార్డు మెంబర్ అభ్యర్థి శివ తదితరులపై షిఫ్ట్ కారు దూసుకెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు సదరు షిఫ్ట్ కారును వెంబడించగా వారు డబ్బులతో పరారైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఉద్రిక్తతకంగా మారింది.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking