*ప్రారంభమైన పోలింగ్
షాద్ నగర్, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో 153 గ్రామ పంచాయతీలకు గాను ఆరు గ్రామపంచాయతీలలో సర్పంచ్ పదవులు ఆరు ఏకగ్రీవం కాగా మిగిలిన 147 గ్రామ పంచాయతీలకు అదేవిధంగా 882 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉదయం 6.30 నుండే జనాలు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.