*అనారోగ్యంతో బాధపడుతున్న కొడువాటి సాయమ్మను పరామర్శించిన ఖాజీపూర్ సర్పంచ్ సాయిలు*
నారాయణపేట,అక్షిత ప్రతినిధి:
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన కొడువాటి సాయమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఖాజీపూర్ గ్రామ సర్పంచ్ సాయిలు ఆమెను నారాయణపేట జిల్లా బాలాజీ హాస్పిటల్ లో గురువారం పరామర్శించారు.

ఈ సందర్భంగా సాయమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు మరియు కుటుంబ సభ్యులకు సూచించారు. గ్రామ ప్రజల ఆరోగ్యం తమ బాధ్యత అని పేర్కొంటూ,ఎల్లప్పుడూ గ్రామస్థులకు అండగా ఉంటామని సర్పంచ్ సాయిలు భరోసా ఇచ్చారు.