క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికి మార్గదర్శకం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ తెలిపారు. ప్రేమ, శాంతి, సేవా భావం అనే క్రీస్తు బోధనలు సమాజంలో మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ క్రైస్తవ సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా వేములపల్లి మండల కేంద్రంలో పలువురు క్రైస్తవ సోదరసోదరీమణుల నివాసాలకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. క్రిస్మస్ సందర్భంగా చిన్నారులను దీవించారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవమే క్రిస్మస్ అని తెలిపారు. ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును క్రైస్తవ సోదరసోదరీమణులంతా విశ్వ వ్యాప్తంగా ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. అందరిపట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, సంతోషాలను పంచుకోవడమే క్రిస్మస్. అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలన్నదే ఏసుక్రీస్తు బోధనల సారాంశం. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని ఏసుక్రీస్తు ఆచరించి చూపారు. ఏసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నల్లమోతు సిద్దార్థ కోరారు. సిద్దార్థ వెంట నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, పుట్టల సందీప్, జాన్సన్, నాగవెల్లి శంకర్, నాగవెల్లి యాదగిరి, డాక్టర్. షేక్ జావిద్, పెరుమాల ధనమ్మ, చిత్రం ఉమా, సుధీర్ కుమార్, జడ రాములు, పుట్టల పౌల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు.