పస్తాల గ్రామంలో ఆదర్శ యూత్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

పస్తాల గ్రామంలో ఆదర్శ యూత్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్షులుగా తాడమల్ల సునీల్ ఉపాధ్యక్షులుగా రెంటాల భాను

గ్రామ అభివృద్దె లక్ష్యంగా ఆదర్శ యూత్ కార్యాచరణ

రాజకీయాలకు అతీతంగా గ్రామ సంక్షేమమే ధ్యేయం

ప్రజాస్వామ్య పద్ధతిలో నూతన కార్యవర్గం ఎంపిక

నాగారం, అక్షిత న్యూస్ : మండల పరిధిలోని పస్తాల గ్రామంలో ఈ యువశక్తికి కొత్త దిశ, ఆదర్శ యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. గ్రామంలో గ్రామ యువతను సంఘటితం చేసి సామాజిక సేవ, గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో పని చేస్తున్న ఆదర్శ యూత్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఘనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ యువత విస్తృతంగా పాల్గొన్న సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో, పరస్పర సమ్మతితో నూతన నాయకత్వాన్ని ఎంపిక చేయడం కస్తాల గ్రామాల్లో యువ సంఘాల పరిపక్వతకు నిదర్శనంగా నిలిచింది. ఈ సమావేశంలో ఆదర్శ యూత్ అధ్యక్షులుగా తాడమల్ల సునీల్, ఉపాధ్యక్షులుగా రెంటాల భాను ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా మేడే సంజయ్ లను సభ్యుల ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ నిర్వాహక సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేసి, సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు వేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ యువత ఐక్యతే గ్రామాభివృద్ధికి పునాది అని తెలిపారు. యువతను ఒక వేదిక పైకి తీసుకువచ్చే వారి శక్తిని సక్రమ దిశలో వినియోగిస్తే గ్రామములో సామాజిక మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు మార్గ నిర్దేశం, విద్యార్థులకు ప్రోత్సాహం, అవసరమైన చోట సేవా కార్యక్రమాలు చేపట్టడం తమ ప్రధాన లక్షమని స్పష్ట చేశారు. గ్రామంలో క్రీడా పోటీలు, జాతీయ పండుగలు, సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతలో దేశభక్తి సమాజ బాధ్యత పెంపొందించేలా ఆదర్శ యూత్ పనిచేస్తుందని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా మార్గ నిర్దేశం చేయడంతో పాటు, ఆరోగ్యం, విద్య, స్వచ్ఛత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నారు. పస్తాల గ్రామంలో యువత ఏకతాటిపైకి రావడం శుభ పరిణామామని పలువురు గ్రామస్తులు అన్నారు. గతంలోనూ ఆదర్శ యూత్ కమిటీ పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిందని తెలిపారు. నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంతో పనిచేసి గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా యువత సంక్షేమం, గ్రామ సంక్షేమమే లక్ష్యంగా ఆదర్శ యూత్ ముందుకు సాగాలని కోరారు. యువశక్తిని సమాజ హితానికి వినియోగించడమే నిజమైన నాయకత్వమని, అలాంటి దిశగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సీనియర్ లు మేడే జాను, కట్ట దయాకర్, కట్ట రమేష్, గాజుల అశోక్, మేడే శ్రీకాంత్, తాడమల్ల భూషణం, కట్ట షద్రాక్, రెంటాల రాజు, చంటి, బాచి, బాబు, భాస్కర్, బొప్పన పల్లి, మేడ వికాస్, భూషణం, కర్ణాకర్, అనిల్, యోనా, ప్రశాంత్, వినయ్, అఖిల్, బెన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking