నాగారంలో ఘనంగా కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం
మండల అధ్యక్షులు తొడుసు లింగయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
కాంగ్రెస్ ఆవిర్భావమే భారత ప్రజాస్వామ్యానికి పునాది
గాంధీ అహింస ఉద్యమాలే దేశ చైతన్యానికి బీజం
ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా కాంగ్రెస్ పోరాట స్ఫూర్తికి నిదర్శనాలు
రాజ్యాంగ నిర్మాణం సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కృషి అపారం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య
నాగారం, అక్షిత న్యూస్ : కాంగ్రెస్ ఆవిర్భావం ప్రజాస్వామ్యానికి పునాది అని నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య నాయకత్వంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1885 డిసెంబర్ 28న స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర్య పోరాటానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసి, స్వాతంత్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని అన్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం ఆధారంగా నడిపిన ఉద్యమాలు దేశ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు కాంగ్రెస్ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ నిర్మాణం, ప్రజాస్వామ్య వ్యవస్థల స్థాపన, సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. దేశ ఐక్యత, లౌకికత, సమానత్వం వంటి విలువలను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు మరింత బాధ్యతగా పనిచేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పార్టీ స్థాపన నాటి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పేదలు, రైతులు, కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిబద్ధతతో, నిజాయితీగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వర్ధమానుకోట సర్పంచ్ ఆకుల బుచ్చిబాబు, పానుగంటి నరసింహారెడ్డి, కన్నెబోయిన వెంకటభిక్షం, ఎల్మకంటి సోమయ్య, నాతి వీరమల్లు, టీపీసీసీ సోషల్ మీడియా తుంగతుర్తి నియోజకవర్గం కో- ఆర్డినేటర్ కొలిపాక సాయికుమార్, బండగోర్ల జనార్దన్, గుంటకండ్ల ముకుందరెడ్డి, వంగూరి బిక్షం (గంగి) పేరాల వెంకన్న, ఆయా గ్రామాల సర్పంచ్ లు బుక్క శ్రీను, కమటం సునీత శ్రీను, బయ్యం సుజాత వెంకన్న, గండమళ్ళ లక్ష్మయ్య, వడ్డే వెంకన్న, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మంగదుడ్ల దశరథ, చిత్తలూరి ఎల్లయ్య, కొనిరెడ్డి మోహన్ రెడ్డి, గండేల ఉపేందర్, చిత్తలూరు వెంకటయ్య, లక్ష్మాపురం ఉపసర్పంచ్ గండెల లలిత రాములు, పసునూరు ఉపసర్పంచ్ నరాల గోపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్పలపెల్లి మధు, గద్దల సైదులు, పాల్వాయి పరుశరాములు, అనంతుల వెంకటయ్య, కన్నెబోయిన రమేష్, నాతి శ్రీను, రామ్మూర్తి,నాగరాజు ,లింగారెడ్డి, కొమరమల్లు, శ్రీకాంత్, నరేష్,తదితరులు పాల్గొన్నారు.