చక్రహరి నాగరాజు మరణం రేషన్ డీలర్ల సంఘానికి తీరని లోటు
రేషన్ డీలర్ల సమస్యలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడిని కోల్పోయాం
రేషన్ డీలర్ల సంఘాన్ని ఐక్యంగా నడిపిన చక్రహరి నాగరాజు
సేవా భావంతో పనిచేసిన గొప్ప రేషన్ డీలర్ల సంఘ నాయకుడు
రేషన్ డీలర్ల హక్కుల పోరాటంలో ముందుండిన ఉద్యమకారుడు
నాగరాజు సేవలను తరతరాలుగా రేషన్ డీలర్ల ఉద్యమ చరిత్రలో నిలిచి ఉంటాయి
నాగారం రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు కన్నెబోయిన లింగయ్య
నాగారం, అక్షిత న్యూస్ : సూర్యాపేట జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షులు చక్రహరి నాగరాజు అకాల మరణం రేషన్ డీలర్ల సంఘానికి తీరని లోటు అని నాగారం మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు కన్నెబోయిన లింగయ్య తీవ్ర దిగ్బ్రాంతి విషాదాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టు కారణంగా నాగరాజు మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కు తరలించగా వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ చక్రహరి నాగరాజు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, రేషన్ డీలర్ల సమస్యలకు అండగా నిలిచిన ఉద్యమకారుడు అని, జిల్లాలో రేషన్ డీలర్ల సంఘాన్ని ఐక్యంగా నడిపిస్తూ, అనేక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రేషన్ డీలర్ల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిని కోల్పోవడం జిల్లా రేషన్ డీలర్ల సంఘానికి తీరని లోటు అని అన్నారు. రేషన్ డీలర్ల సంఘం అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ మరువలేవని, ప్రతి రేషన్ డీలర్ గుండెల్లో ఆయన జ్ఞాపకం చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మెలిగే స్వభావం, సమస్య వచ్చిన వెంటనే స్పందించే తత్వం నాగరాజుదని అన్నారు. నాగరాజు మృతితో జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు తీవ్ర విషాదం నెలకొందని, అనేకమంది రేషన్ డీలర్లు, సహచరులు, సన్నిహితులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక శోకసముద్రంలో మునిగిపోయారని తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు కుటుంబ సభ్యులకు నాగారం మండల రేషన్ డీలర్ల సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.