అమ్మకానికి ప్రభుత్వ భూమి ?

అమ్మకానికి ప్రభుత్వ భూమి ?

కబ్జా చేసి వెంచర్ వేసి ?

– *నిద్రమత్తులో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

హనుమకొండ, అక్షిత ప్రతినిధి :

హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలం ఓ.ఆర్.ఆర్ ను అనుకొని ఉన్న చేపల చెరువు భూమి ఎకరం కబ్జా చేసిన రియల్ దందా వ్యాపారి కొడారి కుమార్ ఆ భూమిని చదును చేయడమే కాకుండా అమ్మడానికి సిద్ధపడినట్లు సమాచారం. కబ్జా చేసి వెంచర్ చేసిన వైనం రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కొడారి కుమార్ గతంలో పలు వెంచర్ల లో తనదైన శైలి లో ఫ్లాట్లు అమ్మడంతో పాటు పలు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ. ఆర్.ఆర్ పక్కన కబ్జా చేసిన ఎకరం భూమిని చదును చేయడం అందులో వెంచర్ కోసమేనా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిద్రమత్తులో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఓ. ఆర్. ఆర్ నిర్మాణం జరిగి ఏడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అధికారులు తమ హద్దులను గుర్తించకుండా వదిలేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కను సైగల్లో అధికారులు ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఇన్ని సంవత్సరాలైనా కబ్జా గురైన భూమిని గుర్తించకపోవడం కింద పోయిన భూమిని రికార్డు లో తొలిగించక పోవడం గమనర్హం. ఇప్పటికైనా కళ్లు తెరిచి జిల్లా అధికారులు చట్టపరమైన తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking