క్రీడలతో మానసిక ఉల్లాసం

పసునూరులో ఉమ్మడి నల్గొండ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

యువతను క్రీడల వైపు నడిపించాలనే లక్ష్యంతో యూత్ కాంగ్రెస్ టోర్నమెంట్

టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య

క్రీడల ప్రోత్సాహానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది

నాగారం అక్షిత న్యూస్ :- తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని లక్ష్యంతో మండల పరిధిలోని పసునూరు గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు టైగర్ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతకు కేవలం వినోదం మాత్రమే కాదని, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే ముఖ్యమైన సాధనమని తెలిపారు. నేటి యువత మతపదార్థాలకు అలవాటు పడకుండా క్రీడల్లో చురుకుగా పాల్గొంటే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, క్రమశిక్షణ. సాహసం, సమిష్టి బాధ్యతలను నేర్పుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు యువత సంక్షేమం కోసం, క్రీడల ప్రోత్సాహానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వేదికలు పెరిగితే ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. రాజకీయాలతో పాటు సామాజిక బాధ్యతగా యువతను క్రీడల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని, ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ యువతకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్దమానుకోట గ్రామ సర్పంచ్ ఆకుల బుచ్చిబాబు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పంది శ్రీను, పసునూరు గ్రామ సర్పంచ్ కమటం సునీత శ్రీను, లక్ష్మాపురం సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్, పస్తాల సర్పంచ్ బుక్క శ్రీను, శాంతినగర్ సర్పంచ్ షేక్ షాహినా యాకూబ్ వలి, నాగారం బంగ్లా సర్పంచ్ బయ్యం సుజాత వెంకన్న, పసునూరు ఉపసర్పంచ్ నరాల గోపి, లక్ష్మాపురం ఉపసర్పంచ్ గండేల లలిత రాములు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అలాగే నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ కొలిపాక సాయి, మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పోగుల విక్రమ్ గౌడ్, పసునూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తలూరు వెంకటయ్య, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కమటం శోభ, మామిడి రేణుక, చింతల మౌనిక, చిట్టమల్ల శిరీష, మల్లెపాక వినోద, లక్ష్మాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మల్లెపాక వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు జలగం అనిల్, ఎన్ఎస్యుఐ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ పత్తేపురం రాఖి, నరాల నాగయ్య, దుర్గయ్య, సుధాకర్, బుచ్చి రాములు, సతీష్, అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking