*విలేకరి నర్సింగ్ కు అండగా
నిలిచిన ఎమ్మెల్యే వివేకానంద*
*రూ. 50 వేల ఆర్థిక సహాయం*
*అందజేసిన కార్పొరేటర్ జగన్, బి ఆర్ ఎస్ పాల్నాయకులు*
*చొరవ చూపిన టియుడబ్ల్యూజె ( ఐజెయు) కు2త్బుల్లాపూర్ యూనిట్*
కూకట్ పల్లి అక్షిత ప్రతినిధి :
అనారోగ్యంతో బాధపడుతున్న విలేఖరి నర్సింగ్ కు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకానంద గౌడ్ అండగా నిలిచారు. రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కే జగన్, బిఆర్ఎస్ డివిజన్ నాయకులు ఎమ్మెల్యే తరపున నర్సింగ్ కుటుంబాన్ని పరామర్శించి నగదును అందజేశారు. గతంలో నర్సింగ్ అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న వివేకానంద స్వయంగా వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను అండగా ఉంటానని హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కుతుబులాపూర్ యూనిట్ ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితిని మరో మారు వివరించారు. ఇందుకు స్పందించిన ఆయన వెంటనే పార్టీ కార్యకర్తలతో ఆర్థిక సహాయాన్ని పంపించారు. కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో నగదును నర్సింగ్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నర్సింగ్ కు సూచించారు. తమ పార్టీ విలేకరులకు ఎప్పుడు అండదండలిగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, కుత్బుల్లాపూర్ నియోజక వర్గ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి బాబా, ఉపాధ్యక్షులు శ్రీధర్, నాయకులు సంతోష్, బి ఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ వేణు, పార్టీ నాయకులు బాబు గౌడ్, మల్లేష్, పాపిరెడ్డి, మహేందర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.