పెట్రోల్ పంప్ ను ప్రారంభించిన మల్లారెడ్డి

పెట్రోల్ పంప్ ను ప్రారంభించిన మల్లారెడ్డి

మేడ్చల్, అక్షిత ప్రతినిధి :

నాణ్యమైన పెట్రోల్, డీజిల్ విక్రయించి వాహనాదారుల మన్ననలను పొందాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ లో నయారా పెట్రోల్ పంప్ ను ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డబిల్ పూర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల వాహనా దారులకు అందుబాటులో ఉండేలా పెట్రోల్ పంప్ పెట్టడంతో వారిని అభినందించారు. అదేవిదంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మంచి క్యాడర్ ఉందన్నారు. కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు తగిన బుద్ది చెప్తారన్నారు. నీటి సమస్యను మాత్రం తట్టుకోలేకపోన్నామన్నారు. జనవరి వచ్చే సరికి ఇంత నీటి కష్టాలు ఉంటే వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్నారు. అనంతరం డబిల్ పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి మాట్లాడుతూ డబిల్ పూర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల వాహనా దారులకు ఈ పెట్రోల్ పంపు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్ పూర్ పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ సురేష్ రెడ్డి, నాయకులు భాగ్యరెడ్డి, రామోదర్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, నందారెడ్డి, మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking