సిసిఆర్బిని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సిసిఆర్బీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం సాయంత్రం తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ సెక్షన్ల వారిగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల వివరాలతో పాటు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, అందులో నమోదు చేసిన వివరాలను సంబంధిత సంబంధిత సెక్షన్ సిబ్బంది అడిగి తెలుసుకున్నారు.

ఈ తనిఖీల్లో పోలీస్ కమిషనర్, రౌడీ షీట్లు, జైల్ రిలీజ్, ఎస్సీ, ఎస్.టి, మిస్సింగ్, యం. సి.ఆర్ , విచారణలు, చోరీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, నేరాలు,మహిళలపై నేరాలకు సంబంధించి రికార్థుల నిర్వహణపై పోలీస్ కమిషనర్ పరిశీలించారు.
ఈ తనిఖీల్లో అదనపు డీసీపీ రవి, ఏసీపీలు డేవిడ్ రాజు, జనార్ధన్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రావు తో సిసి ఆర్బీ విభాగం ఎస్.ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.