ప్రజల శత్రువు కాంగ్రెస్ పార్టీనే…..
చంద్రబాబు- రేవంత్ వి చీకటి ఒప్పందాలు…..
మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :
తెలంగాణలో గడిచిన రెండేళ్ల కాంగ్రేస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల్లో హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. అందుకోసం మోసకారి కాంగ్రెస్ ను ఓడగొట్టాలనీ ప్రజలు కంకణ బద్దులై ఉన్నారని జోష్యం చెప్పారు.రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీనే ప్రజల శత్రువని, మీకు అభివృద్ధి కావాలా…? అరాచకాలు కావాలనా….? ప్రజలను ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబును సంతృప్తి పరచడమే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారని, చంద్రబాబు రేవంత్ వి చీకటి ఒప్పందాలని ఆరోపించారు.2014 కు ముందు ఏట్లున్నదో ఈ రెండేళ్ల కాగ్రెస్ పాలనలో కూడా అట్లనే ఉన్నదని,అవే అరాచకాలు, కబ్జాలు,బెదిరింపులు,ఆక్రమణలు ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణా,గోదావరి జలాలను ఆంధ్రకు దోచి పెడుతున్నరని, బణకచర్ల పేరు మార్చి నల్లమల్ల సాగర్ అంటున్నారని మండి పడ్డారు.

దానికి ఏ పేరు పెట్టినా జరిగేది తెలంగాణ నీళ్ల దోపిడేనని,రాజకీయ అవసరాల కొరకే మన నీళ్లను దోచి పెడుతున్నారని ఆరోపించారు. అది నుంచి కూడా తెలంగాణకు జాతీయ పార్టీలే శత్రువులని,ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే తప్ప స్పందించరా అని ప్రశ్నించారు.కేసీఆర్,కేటీఆర్ పైన ఇష్ట మొచ్చినట్లు మాట్లాడింది వాళ్లు కాదా అని,ఇష్ట మొచ్చినట్లు పిచ్చి రాతలు రాయించినప్పుడు సోయిలేదా అన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే బాదైతుందా అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు మొదటి నుంచి ఆరోపణలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని, కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వచ్చాయని ఉన్నత స్థాయి అధికారులు స్పందిస్తున్నారన్నారు. కెసిఆర్ పాలనలో పదేండ్లు ఇటువంటి ఘటనలు జరిగాయా అని,గాంధీ భవన్,సీఎం ఆఫీస్ నుంచి గోస్ట్ సైట్లు పని చేస్తున్నయన్నారు. వాటి నుంచే ఇటువంటి వార్తలు వస్తున్నాయని,ముందు వాటిని బంద్ పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని వ్యంగ్యంగా సూచించారు.ఇదే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ సైనికుల స్లోగన్ అని,సంక్రాoతి కంటే ముందే పట్టణాల్లో పండుగ వాతావరణం మొదలైందని కితాబిచ్చారు.కారు గుర్తు కనబడితే చాలు ఓటేసేందుకు ప్రజలంతా సిద్దమంటున్నారని,
కెసిఆర్ రుణం తీర్చుకోవాలనే తపన ప్రజల్లో కనబడుతుందని అభిప్రాయ పడ్డారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తాయని, రాజకీయాల్లో విలువలు పాటించాలి తప్ప,తప్పుడు రాతలు ఎవరిపై వచ్చినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి,నాయకులు ఒంటెద్దు నరసింహా రెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్,గోపగాని వెంకట నారాయణ గౌడ్, పెరుమాళ్ళ అన్నపూర్ణ, పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.