టీకే లక్ష్మణరావు సంస్మరణ సభ.. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషిచేసిన లక్ష్మణరావు

  • టీకే లక్ష్మణరావు సంస్మరణ సభ
  • జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషిచేసిన లక్ష్మణరావు
  • తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన జర్నలిస్టులు

వరంగల్, అక్షిత బ్యూరో: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు టికే లక్ష్మణరావు సంస్మరణ సభ శనివారం నగరంలోని సికేఎం కళాశాల మైదానంలో టి డబ్ల్యూజెఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ కార్యదర్శి బొట్ల స్వామిదాసు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా లక్ష్మణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మణరావు మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. లక్ష్మణరావు ఆశయ సాధన కోసం టి డబ్ల్యూ జె ఎఫ్ సభ్యులు కృషి చేయాలని కోరారు. అనంతరం టి డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పాలడుగుల సురేందర్ మాట్లాడుతూ లక్ష్మణరావు ఆశయాలు సాధనకు జర్నలిస్టులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడి జర్నలిజం విలువలు కాపాడుతూ హక్కుల సాధనకు నిరంతరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టి డబ్ల్యూ జేఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్ది రాజేందర్ సంయుక్త కార్యదర్శి బావండ్లపల్లి కిరణ్ కుమార్ సభ్యులు రాంపెల్లి శ్రీనివాస చారి, జి మొగిలి, కన్నాల రవి, గాదె నవీన్, వి రాజు, చీకటి వంశీ, వారణాసి మోహన్, కోడెపాక శ్రీకాంత్, హనుమకొండ విజయ్ కుమార్, పోలేపాక మధు, కార్తీక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking