క్రీడలతో మానసిక ఉల్లాసo 

క్రీడలతో మానసిక ఉల్లాసo 

జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించగా గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మరి ప్రతాపరెడ్డి హాజరై వారి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, క్రీడల మంచి ఆరోగ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకునూరు గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొమ్మురవి, ఉప సర్పంచ్ కడారి పల్లవి భాస్కర్, రాంపూర్ గ్రామ సర్పంచ్ శెట్టి కొమురయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ జంబుల వెంకటరెడ్డి ఆకునూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల రాజు, వార్డు సభ్యులు, మరియు నాయకులు బోయిని రాజు, శివల రాజయ్య, భూమాని బాలరాజు, జిల్లా నాయకురాలు తోళ్ల రాజేశ్వరి, గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షులు పాల సాయిలు, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking