అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు

జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

చేర్యాల, అక్షిత ప్రతినిధి: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని జనగామ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, గ్రామ సర్పంచ్ కొమ్ము రవితో కలిసి నూతన ఇంద్రమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ గ్రామాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, గత ప్రభుత్వ ఆయాంలో ఏ ఒక్క పేదవారికి ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే నిరుపేదలకు సొంతింటి కల సహకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆత్మ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటరెడ్డి, ఆకునూరు గ్రామ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్,గ్రామ ఉపాధ్యక్షులు పెద్దముత్తని పోచయ్య, రాంపూర్ గ్రామ సర్పంచ్ శెట్టి కొమురయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భూమని బాలరాజు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిని రాజు, చేవెళ్ల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు తోళ్ల రాజేశ్వరి, వార్డు సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking