అక్షిత అక్షరం.. ప్రజాపక్షం! అక్షిత జాతీయ దినపత్రిక -2026క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సీడీపీఓ మమత

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్-2026 లను శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ స్వగృహంలో ఆవిష్కరించారు. క్యాలెండర్ బాగుందని సమగ్రంగా ఉందని పేర్కొన్నారు. చిన్నపత్రికలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. అదేవిధంగా ఐసీడీఎస్ మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమత క్యాలెండరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కార్యాలయ ఎఫ్ఎఒ ఎం.బాలాజీనాయక్, పాత్రికేయులు ఖాజా హామీదుద్దిన్, ఎండి.అస్లాం, కాంగ్రెస్ నాయకులు, ఐసిడిఎస్ బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత, సూపర్ వైజర్లు నాగమణి, నజీమా బేగం, పద్మ, బి.రాధిక, లీలకుమారి, లక్ష్మిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking