మాటిచ్చారు
స్థలం కేటాయించారు
క్రైస్తవులకు
అండగా బిఎల్ఆర్
బొంతుగుట్టలో
మరో ఎకరం స్థలం
క్రైస్తవుల సమాధుల
తోటకు స్థలం
బత్తులకు ఎంసీసీడబ్ల్యూఏ
నేతల కృతజ్ఞతలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
క్రైస్తవులకు మాటిచ్చారు.. నెరవేర్చారు. మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల క్రైస్తవులకు సమాధుల తోట అత్యంత అవశ్యం. రోజు రోజుకు మరింత విస్తరిస్తున్న మిర్యాలగూడలో స్థలం అత్యంత ఖరీదైనది. పట్టణ, పరిసర ప్రాంతాల క్రైస్తవులు చనిపోతే సమాధుల తోట లేక తల్లడిల్లే పరిస్థితి.1994లోనే బొంతుగుట్ట (కొత్తూరు) లో కొంత స్థలం కేటాయించినప్పటికి సరైన పర్యవేక్షణ కొరవడి కొంత స్థలాన్ని సమీప రైతులు ఆక్రమించుకున్నారు. కొంత స్థలంలో కొన్ని సమాధులు పెట్టినప్పటికీ ఇంకొంత స్థలాన్ని క్రైస్తవుల అనైక్యతను ఆసరా చేసుకొని ఆక్రమణల పర్వం తలెత్తింది. ఈ విషయమై ఎన్నో పర్యాయాలు పాస్టర్లు, క్రైస్తవ పెద్దలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ పెద్దలు, పాస్టర్లు ఐక్యంగా చేరి మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా రెండేళ్ల నుంచి క్రైస్తవుల మధ్య ఐక్యతను చాటాయి. మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ముండ్లగిరి కాంతయ్య, ప్రధాన కార్యదర్శి చిలుక విద్యాసాగర్, కోశాధికారి పెయ్యల ప్రసాద్, ఉపాధ్యక్షులు పిఆర్ ఎలీషా తదితరులతో కలిసి పలు అధ్యాత్మిక సేవలకు విశిష్ట సేవలు అందించారు. క్రైస్తవుల హక్కుల సాధనకు నడుంబిగించారు. సమాధుల తోటకు స్థలం కేటాయింపు మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ మేరకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కేటాయించిన స్థలానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు తదుపరి గతంలో కేటాయించిన స్థలం, ప్రస్తుత స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి తగిన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు సంఘం మరింత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.