కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేద్దాం
–శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి
–శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామిని ఘనంగా స్వాగతం పలికిన డాక్టర్ పులిపాటి ప్రసాద్
ఖమ్మం/అక్షిత బ్యూరో :
కాలుష్య రహిత సమాజం కోసం మనమంతా కృషి చేద్దాం అని శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి అన్నారు. రైతులకు మద్దతుగా నేలకొండపల్లి నుంచి భక్త రామదాసు ధ్యానమందిరం వరకు సుఫల యాత్ర జరింగింది. ఈ సందర్భంగా ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామిని ఖమ్మం నగరంలోని డాక్టర్ పులపాటి నగర్ 2 ప్రాంతంలో గల డాక్టర్ పులిపాటి ప్రసాద్ నివాసంలో
డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు.

ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ నివాసంలో స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఈ కాలుష్య సమాజంలో ప్రతి వ్యక్తి కాలుష్యాన్ని నియంత్రించేందుకు తమ ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఆధ్యాత్మిక భావాలతో ముందుకు సాగాలని సూచించారు. ధరిత్రిని కాపాడేది సుఫల యాత్ర అని ఈ ధరిత్రి తోనే మన జీవన యానం ముడిపడి ఉందని ఇహ లోకంలో సకల జీవరాసులు ఉన్నాయని వాటిని రక్షించుకుంటూ మన జీవన యానాన్ని వినాశ రహిత సమాజ కోసం ఆహార పదార్థాల నుంచి మొదలుకొని సమ సమాజ స్థాపన నిర్మాణంలో మనమంతా భాగస్వాములం అయినప్పుడే ఈ భూ ప్రపంచాన్ని కాపాడిన వారమవుతామని తద్వారా ఆరోగ్యవంత మైన సమాజాన్ని నిర్మించిన వా అన్నారు. మన తరమే కాకుండా భావితరాలకు కూడా మనము తీసుకునే శ్రేష్టమైన నిర్ణయాలతో మనుగడ సాధించవచ్చని చిన జీయర్ స్వామి అన్నారు.ఈయాంత్రిక యుగంలో ప్రతిదీ కూడా రేడియేషన్ లతో ముడిపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనము వినియోగించే సెల్ఫోన్ల వద్ద నుంచి మొదలుకొని విద్యుత్ గృహపకరణ యాంత్రిక పరికరాలు కూడా కొంత ప్రమాదకరంగా మారాయని వాటి వినియోగంలో మనం దూరంగా ఉన్నప్పుడే మనిషి జీవన ప్రమాణం మెరుగవుతుందని స్వామీజీ అన్నారు.ప్రస్తుత సమాజంలో కుట్రపూరిత వినాశకర ఆలోచనలు ఉన్నాయని అవి దరిచేరకుండా ఉండాలంటే కేవలం ఆధ్యాత్మిక చింతనే మార్గమని స్వామీజీ పేర్కొన్నారు.చిన జీయర్ సంస్థల ముఖ్య సలహాదారు ఎర్నేని రామారావు ఖమ్మం జిల్లా వికాస తరంగిని బాద్యులు శ్రీనివాస రావు మహిళా వికాస తరంగిణి బాధ్యులు నోముల ఉషకన్య భోజెడ్ల శాంతశ్రీ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రముఖ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి కాటంనేని రమేష్ సత్యప్రసాద్ దిలీప్ చౌదరి బాజ్జీ హైమావతి తిరుమలరావు జీవీ మాల్ అధినేత గుర్రం నరసింహారావు దంపతులు వేములపల్లి వెంకన్న గెజిటెడ్ ఆఫీసర్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ కోటి మాధవరావు వెంకటేశ్వర రావు పుల్లారెడ్డి సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి ఖమ్మం పౌర సమితి నాయకులు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వర్తక సంఘం అధ్యక్షులు పట్టణ ప్రముఖులు సుమారు రెండు వేల మంది హాజరై ఆధ్యాత్మిక చింతనతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నజీయర్ స్వామివారి ప్రవచనాలు విని మంగళాశాసనాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు ఆనందభరితులయ్యారు.