కర్ల రాజేష్ లాకప్ డెత్ పై భారీ నిరసన ర్యాలీ..!

  • కర్ల రాజేష్ లాకప్ డెత్ పై భారీ నిరసన ర్యాలీ
  • కర్ల రాజేష్ మృతిపై మంత్రి ఉత్తం పద్మావతిలు పోలీసులు అధికారులు స్పందించాలి
  • బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్షిత ప్రతినిధి: కర్ల రాజేష్ లాకప్ డెత్ ఫై మంత్రి ఉత్తం ఎమ్మెల్యే పద్మావతి ,పోలీసు అధికారులు మౌనంగా ఉంటూ స్పందించకపోవడంలో అంతర్యం ఏమిటని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు శనివారం దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ శాంతియుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, రాజేశ్ తల్లి కర్ల లలితమ్మతో కలిసి ముఖ్య అతిథులుగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…

కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్య జరిగి 60 రోజులు గడుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. పోలీసులకు అడ్డు అదుపు లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం, ఆస్తి నష్టం కలిగించడం, దిమ్మెలు పగలగొట్టడం వంటి ఘటనలకు పాల్పడుతున్నా, పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప ఇప్పటివరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితులను ఇక సహించేది లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందుముందు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.కేవలం లక్ష రూపాయల చెక్కు విషయంలో కర్ల రాజేష్‌ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అతని హత్యకు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ప్రత్యక్ష కారణమై ఉన్నా, ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాజేష్ మరణంలో విచారణ నుంచి పోస్టుమార్టం వరకు మొత్తం వ్యవస్థ పారదర్శకంగా లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అనేక ఆధారాలు ప్రజల ముందు, ప్రభుత్వ ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే, స్థానిక ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ దంపతులు తమ అధికారాన్ని ఉపయోగించి బాధ్యులను ఎలా వెనకేసుకొస్తున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. గతంలో తాను అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పోలీసులతో ఎలాంటి మర్యాదతో, బాధ్యతాయుతంగా వ్యవహరించేవాడినో ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకు బాగా తెలుసన్నారు రాజేశ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking