ప్రజల విశ్వాసానికి ప్రతీక అక్షిత జాతీయ దినపత్రిక- డి ఎం హెచ్ వో అప్పయ్య

హనుమకొండ, అక్షిత ప్రతినిధి: హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య అక్షిత దినపత్రిక నూతన క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు శనివారం అక్షిత స్టాఫ్ రిపోర్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్ర మం నిర్వహించబడింది. ఈ సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్.ఏ.అప్పయ్య మాట్లాడుతూ సంఘటనలు జరిగిన క్షణాల్లో నే ప్రజలకు వేగంగా నిజాయితీగా వార్తలను అందిస్తూ అక్షిత జాతీయ దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని చోటుచేసుకుందని పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా బాధ్యతాయుతంగా అందించడంలో అక్షిత పత్రిక చేస్తున్న కృషికి అభినందనీయమని తెలిపారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకురావడంలో అక్షిత దినపత్రిక కీలక పాత్ర పోషిస్తుందని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్టాటస్టికల్ ఆఫీసర్ డా.ప్రసన్నకుమార్, అక్షిత స్టాఫ్ రిపోర్టర్ కొడేపాక శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking