పటాన్‌చెరు, అక్షిత ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్‌చెరు పరిధిలోని చర్చిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 10 లక్షల 80 వేల విలువైన చెక్కులను శనివారం ఆయా చర్చిల పాస్టర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాల మూలంగా చెక్కుల పంపిణీ ఆలస్యం జరిగిందని తెలిపారు.రెండు విడతలలో మొత్తం 70 చర్చిలకు రూ.21 లక్షలు అందచేయడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం నుండి మంజూరైన ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి,మెప్మ డిపిఓ స్వాతి, సిఓలు రేఖా,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.