జాన పహాడ్ దర్గా సర్వ మత సమ్మేళ్ళానికి ప్రతీక..

  • జాన పహాడ్ దర్గా సర్వ మత సమ్మేళ్ళానికి ప్రతీక..
  • దర్గాలో సైదులు బాబాకు చాదర్, దట్టినీ కప్పిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:  జాన్ పహాడ్ దర్గా సర్వమత సమ్మేళ్ళానికి ప్రతీక అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ,పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకున్నారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శుక్రవారం ఉర్సు ఉత్సవాలు జరగగా శనివారం ఆయన జియారత్ (దర్శనం) కోసం వచ్చినట్లు తెలిపారు. ఇక్కడకి రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వస్తారని హిందూ,ముస్లిం,సిక్కు,క్రైస్తవ అందరూ ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళ్తున్న దృశ్యాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆనందం వెలిబుచ్చారు.​మీ అందరి మధ్యకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని,అల్లా దయవల్ల అవకాశం దొరికితే మళ్ళీ వస్తానని,నేను కోరుకునేది ఒక్కటేనని మీరందరూ ఇక్కడ కలిసి మెలిసి ఉండాలని,మంచి పనులు చేయాలని,అన్ని వర్గాలు కలిసి ఉంటేనే పని బాగా జరుగుతుందన్నారు.​ఇక్కడికి బయటి నుంచి కూడా చాలా మంది వస్తుంటారని ఇది చాలా పెద్ద దర్గా షరీఫ్,ఇక్కడ గొప్ప మహనీయులు (బుజుర్గాన్-ఏ-దీన్) కొలువై ఉన్నారని చెప్పారు.​చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ నా శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఉర్స్ ప్రతి ఏటా చాలా బాగా జరుగుతుందని వెల్లడించారు.ఇన్షా అల్లాహ్ వచ్చే ఏడాది కూడా ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆర్డిఓ శ్రీనివాసులు,డిఎస్పి ప్రసన్న కుమార్,మైనార్టీ సంక్షేమ అధికారి నరసింహ రావు,తహసీల్దార్ కమలాకర్,వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ మహబూబ్, ముజవర్ జానీ బాబా,ప్రజా ప్రతినిధులు, అధికారులు,తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking