జిల్లా కలెక్టర్ హనుమంత రావు కి రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం.!

  • జిల్లా కలెక్టర్ హనుమంత రావు కి రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం
  • బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీస్ విభాగంలో అవార్డు 
  • రాష్ట్రస్థాయిలో జిల్లాకి ఉత్తమ పురస్కారం 

భువనగిరి, అక్షిత న్యూస్: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఉత్తమ ఎన్నికల అధికారి అవార్డును అనుకున్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఆదివారం రోజు గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించిన ఎన్నికల అధికారులు,సిబ్బంది,ఎన్నికల నిర్వహణ లో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్క అధికారికి కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.సమిష్టి కృషి వల్లనే మన జిల్లా కి ఈ అవార్డు దక్కిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking