దుబ్బాకలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మూడు రంగుల జెండాతో దుబ్బాక గ్రామం పండగ వాతావరణం సంతరించుకుంది. 100 మీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని విద్యార్థులు,యువకులు, గ్రామ ప్రజలు పట్టుకొని ప్రధాన రోడ్డు వెంట ప్రదర్శనగా వెళ్లి వార్డుల వెంట జాతీయ పతాకాల ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశభక్తిని యువత విద్యార్థులు పెంపొందించుకొని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉప సర్పంచ్ గుండాల రమేష్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజలు, యువతీ యువకులు పాల్గొన్నారు.