“నాగార్జున” గణతంత్ర సంబరం

నాగార్జున పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామన్నపేట, అక్షిత ప్రతినిధి :

నాగార్జున పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డబ్ల్యు. మాయాదేవి, హిందీ విభాగ అధ్యయన మండలి సభ్యురాలు డాక్టర్ కె. సంగీత వ్యాస్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు, విధులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.

తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం తీసుకొచ్చే విధంగా జీవితాన్ని మలచుకోవాలని పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధి డాక్టర్ నాగరాజు, ప్రధానోపాధ్యాయురాలు నకిరేకంటి రేఖ, ఉపాధ్యాయులు అక్రం, సంధ్య, స్వప్న, విజయశ్రీ, లత, వినీషా, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking