*ఘనంగా అగ్రంపహాడ్ సమ్మక్క సారక్క జాతర*
*జాతరలో కొలువుదీరిన సమ్మక్క సారక్క*
*అన్ని వసతులు ఏర్పాటు చేశాం*
*ఈఓ నాగేశ్వరరావు*
హన్మకొండ, అక్షిత ప్రతినిధి:
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామం లో శ్రీ సమ్మక్క సారక్క జాతర ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కొన్ని లోటుపాట్లు లైటింగ్ పారిశుధ్యం చిన్న చిన్న లోపాలు జరిగాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో లా జరగకుండా ఈసారి మెరుగైన వసతులను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియజేయగా వారి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరుగుదొడ్లు, త్రాగునీరు ఇలా అన్ని వసతులను ఏర్పాటు చేశామని పంచాయతీరాజ్ శాఖ ద్వారా వివిధ చెట్లను తొలగించి కూడలిలో దారి ఏర్పాటు చేసి మరియు కార్మిక సిబ్బంది వెంట వెంటనే భక్తులకు శుభ్రత ఉండే విధంగా దృష్టి పెట్టామన్నారు నిరంతరం కరెంటు ఉండే విధంగా ఎలక్ట్రిసిట్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటున్నామన్నారు క్యూలైన్స్ 100/- మరియు 500 ఉన్న క్యూ లైన్ 200 కే వృద్ధులకు వితంతువులకు ప్రత్యేకంగా దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు ఆర్టీసీ వారి సహకారం తీసుకొని వెంట వెంటనే వచ్చే భక్త జనాన్ని వారి గమ్య స్థానానికి చేరే విధంగా ఏర్పాటు చేశామన్నారు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాలయ ప్రాంగణంలో మరియు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు శ్రీ సమ్మక్క సారక్క జాతరకు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో సుమారు 12 లక్షల వరకు భక్తులు వచ్చారని ఈసారి గతం కంటే ఎక్కువ మంది భక్తులు ఈ సమ్మక్క సారక్క జాతరను దర్శించు కోబోతున్నారని అన్నారు.