అదుపు తప్పిన ఫణిగిరి మేరీ మదర్ స్కూల్

అదుపు తప్పిన ఫణిగిరి మేరీ మదర్ స్కూల్

త్రుటిలో తప్పిన స్కూల్ బస్సు భారీ ప్రమాదం

ఊపిరి పీల్చుకున్న మేరీ మదర్ స్కూల్ విద్యార్థులు

అతివేగం, రోడ్డు పాడవడమే కారణం

డ్రైవర్ నిర్లక్ష్యాన్ని సమర్థించేందుకు యత్నించిన స్కూల్ టీచర్స్

తారు రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే సామేలును కోరిన పిల్లల తల్లిదండ్రులు

నాగారం, అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని మేరీ మదర్ స్కూల్ కు చెందిన స్కూల్ బస్సు బుధవారం ఉదయం అదుపుతప్పి రోడ్డు పక్క గుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేరబోయిన గూడెం, నరసింహుల గూడెం గ్రామాల నుండి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరిపించుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ అతివేగంగా, రాంగ్ రూట్ వైపు నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే అదుపుతప్పిందని ఆరోపిస్తున్నారు. పైగా ఆ మార్గం పూర్తిగా గుంతల మయంగా మారి ఉండడంతో ప్రమాద తీవ్రత జరిగిందని అన్నారు. ప్రమాదవ స్థలాన్ని పరిశీలించిన గ్రామస్తులు, తల్లిదండ్రులు డ్రైవర్ ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మండలానికి చెందిన రిపోర్టర్ వెంటనే స్పందించి స్పాట్ న్యూస్ గా పత్రికలో ప్రచురించగా మేరీ మదర్ స్కూల్ కు చెందిన హిందీ టీచర్స్ మేడం రిపోర్టర్ కు ఫోన్ చేసి డ్రైవర్ నిర్లక్ష్యాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తూ వాదోపవాదాలకు దిగింది. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారులు స్పందించి ఫణిగిరి మేరీ మదర్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అర్హత లేని డ్రైవర్లను వెంటనే విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు కు విజ్ఞప్తి చేస్తూ పేరబోయిన గూడెం, నరసింహులగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్డు గతంలో ఇసుక లారీల వల్ల పూర్తిగా ధ్వంసం అయిందని, గ్రామస్థులు, గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ప్రయాణించాలంటే చాలా ప్రమాదకరంగా ఉందని వెంటనే బీటి రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking