ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

మాజీ డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివకుమార్ రెడ్డి

నారాయణపేట, అక్షిత న్యూస్ :

పచ్చటి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివకుమార్ రెడ్డి కోరారు. మంగళవారం నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి మాజీ డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివకుమార్ రెడ్డి హాజరై పూజలు చేపట్టారు. ఎల్లమ్మవ్వకి తొలి పూజ నిర్వహించిన శివ కుమార్ రెడ్డి అంతా పచ్చగా ఉండాలని కోరారు.

నియోజకవర్గ ప్రజలు, యువకులు, రైతులు అందరూ సంతోషంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, భక్తులు, గ్రామస్తులు మండల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking