విద్యార్థులే దేశ భవితకు పునాది

ఈటూరులో జాతీయ గీతాలతో ప్రారంభమైన గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి ఎంఈఓ వాసం ప్రభాకర్

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులు రాజ్యాంగ విలువలపై అవగాహన

రాజ్యాంగం ఇచ్చిన హక్కులు విధులపై విద్యార్థులకు అవగాహన

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐఏఎస్ అధికారి గడ్డం ముకుందారెడ్డి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే దేశాభివృద్ధి ప్రజల భాగస్వామ్యం అవసరం

ఉపాధ్యాయుల అంకిత భావాన్ని కొనియాడిన గ్రామ సర్పంచ్ వంగూరి దామోదర్

నాగారం అక్షిత న్యూస్ :- దేశ స్వాతంత్ర పోరాట ఫలితంగా రూపుదిద్దుకున్న భారత గణతంత్రానికి నిదర్శనంగా ప్రతి ఏట జరుపుకునే గణతంత్ర దినోత్సవాన్ని ఈటూరు ప్రభుత్వ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు సమిష్టిగా పాల్గొని జాతీయ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇన్చార్జి మండల విద్యాధికారి వాసం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఎగురవేశారు. అనంతరం జాతీయగీతం ఆలపించి దేశ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి ఈటూరు గ్రామ ముద్దుబిడ్డ గడ్డం ముకుందా రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం, గణతంత్ర విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పై విస్తృతంగా వివరించారు. రాజ్యాంగ నిర్మాతలు ప్రజలకు ఇచ్చిన హక్కులు, విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతతో ఎదిగితేనే దేశ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి దేశాభివృద్ధితో సమానమని, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంగూరి దామోదర్ మాట్లాడుతూ ఈటూరు ప్రభుత్వ పాఠశాల గ్రామానికి గర్వకారణమని అన్నారు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తో పాటు గ్రామ డెవలప్మెంట్ కమిటీ సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. విద్యారంగానికి చేసే ప్రతి సహాయం భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. గ్రామస్తులు, దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి తోడ్పడడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి పలువురు దాతలు చేయూతనిచ్చారు. టెక్నో డిడ్ చైర్మన్ వంగూరి దామోదర్ వంగూరి సోమయ్య చేతుల మీదుగా 200 మంది పిల్లలకు టిఫిన్ బాక్స్ మరియు వాటర్ బాటిల్స్ కొనుగోలు కొరకు రూ.4500/- లను అందించారు. అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు బండి సాయన్న పాఠశాల అభివృద్ధి కొరకు రూ.1,00,000/- లను పాఠశాల అభివృద్ధి కమిటీలో పిక్స్ డ్ డిపాజిట్ చేసి డిపాజిట్ చేసి అట్టి డబ్బుల ద్వారా వచ్చే మిత్తి అమౌంట్ తో పాఠశాల అభివృద్ధికి వాడుకోవాలని ఆర్థిక సహాయం అందించారు. పాఠశాల 10వ తరగతి విద్యార్థుల కొరకు స్టడీ చైర్స్, పిల్లల షూలను సింగరం ఆంజనేయులు, మేరే సుదర్శన్, నంగునూరు వెంకటేశం, సింగం శ్రీనివాస్, అంబటి కిరణ్ కుమార్ బహుకరించారు. లయన్ డాక్టర్ మొగుళ్ళ గిరి గౌడ్ మరియు ఎంపీపీఎస్ ఈటూరు ఉపాధ్యాయులు పాఠశాలలకు అవసరమైన మైక్ సెట్ ను బహుకరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా ఐదవ తరగతి విద్యార్థులకు నిఘంటువులను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల్లో పద సంపద పెంపొందించేందుకు ఈ నిఘంటువులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమం చివరలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇన్చార్జి ఎంఈఓ వాసం ప్రభాకర్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గ్రామ సర్పంచ్ పాలకమండలి కి, గ్రామ ప్రజలకు, దాతలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈటూరు ప్రభుత్వ పాఠశాలను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరి సహకారం కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నంగునూరు మంజుల ప్రకాష్, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, వంగూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వంగూరి సోమయ్య, ఈటూరు గ్రామ డెవలప్మెంట్ కమిటీ, రిటైర్డ్ ఉపాధ్యాయులు పొన్నాల రామచంద్రయ్య, కన్నెబోయిన లింగయ్య, యాదగిరి, నర్సిరెడ్డి, యాదగిరి, ఉప్పలయ్య, ఎల్లాచారి, సింగం శ్రీనివాస్ గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking