వాడ వాడలా త్రివర్ణ పతాక రెపరెపలు

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగారం మండలమంతా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ప్రభుత్వ కార్యాలయాల ముందు ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలకు ఘన నివాళులు

రాజ్యాంగమే దేశానికే మార్గదర్శక దీపం

ప్రజాస్వామ్య విలువలకు బలమైన పునాదులైన రాజ్యాంగ స్ఫూర్తి

రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక దినాన్ని స్మరించుట

ప్రజాస్వామ్య పరిరక్షణే గణతంత్ర దినోత్సవ అసలైన సారాంశం

మండల గ్రామ గ్రామాన దేశభక్తి నినాదాలతో మార్మోగిన వేడుకలు

గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు

ప్రజలకు గౌరవంగా జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగం

నాగారం, అక్షిత న్యూస్ :- మండల కేంద్రంలో మరియు ఆయా గ్రామాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని నాగారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారతదేశం గణతంత్ర రాజ్యాంగ అవతరించి ప్రజాస్వామ్య విలువలకు బలమైన పునాదులు వేసిన ఈ దినం. ప్రతి భారతీయునికి గర్వకారణం అని మండల కేంద్రంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు అన్నారు. రాజ్యాంగమే దేశానికి మార్గదర్శక దీపమని, సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావం, న్యాయమంటి విలువలను ప్రతి పౌరుడికి అందించిన మహా గ్రంథమని వారు వివరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను అధికారులు ఘనంగా స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, అనగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని, రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన గణతంత్ర సార్ధకమవుతుందని అన్నారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు అధికారులు మూడు రంగుల జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అలాగే మండల పరిధిలోని 14 గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు గ్రామ సర్పంచ్ లు మరియు గ్రామపంచాయతీ కార్యదర్శులు పాలక మండలి ల మరియు ఆయా ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించాయి. గ్రామ గ్రామాన నువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ దేశభక్తి భావాలను రగిలించి, దేశ సమగ్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని మాట్లాడిన వక్తలు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల వ్యాప్తంగా దేశభక్తి నినాదాలు, రాజ్యాంగ విలువల సందేశాలతో ఉత్సాహంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ హరి కిషోర్ శర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. భీంసింగ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. చిరంజీవి, మండల వైద్యాధికారి యనగందుల నగందుల నాగరాజు, మండల వ్యవసాయ అధికారి కృష్ణ కాంత్, మండల విద్యుత్ అధికారి కె. మహేంద్ర కుమార్, విద్యాశాఖ అధికారి వాసం ప్రభాకర్, ఏపిఎం వెంకన్న, ఇరిగేషన్ డిఈ సునీత, పంచాయతీరాజ్ డిఈ బాబురావు, మండల పశు వైద్యాధికారి రవి, పసునూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ బల్గూరి చంద్రబాబు, ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ఆయా ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందీలు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking