జలాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద
రూ.4,17,200/- నగదు పట్టివేత
ఎస్ఐ వెంకటేశ్వర్లు
నారాయణ పేట,అక్షిత ప్రతినిధి:
మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ఎఫ్ ఎస్ టి ఫ్లయింగ్ స్కాడ్ టీం వాహనల తనిఖీల సందర్భంగా
యాద్గిరి నుండి నారాయణపేట వస్తున్న మహమ్మద్ యూనస్ వద్ద 2,17,200/- రూపాయలు, కర్నాటక నుండి నారాయణపేట కు వస్తున్న నాగిరెడ్డి, అశోక్ నగర్, నారాయణపేట. చెందిన వ్యక్తి వద్ద రూ.2,00,000/- లక్షల నగదును
మొత్తం 4,17,200 రూపాయలు పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని నగదు గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద నిరంతరం వాహనాల తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని,ప్రజలు నగదు,మద్యం,ఇతర విలువైన వస్తువులు తీసుకురావొద్దు అని ఎస్ఐ తెలిపారు.