*ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్*
నారాయణ పేట, అక్షిత ప్రతినిధి:
ఆధార్ పనిచేయని కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన డి ఎల్ ఏ ఎమ్ సి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర ఆధార్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ దామోదర్ , అసిస్టెంట్ కలెక్టర్ శ్రీను రెవెన్యూ , అడిషనల్ డి.ఎస్.పి కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు.ఈ సమావేశంలో చర్చించిన అంశాలుఎన్ బి యు పెండెన్సీ యుడైస్ పాఠశాల వారీగా పెండెన్సీ,ఆధార్ కేంద్రాలు పనిచేయని మండలాల్లో శిబిరాలను ఏర్పాటు చేయించడానికి సూచనలు ఇవ్వబడ్డాయి. ప్రతి ఏఈకె కేంద్రంలో కొత్త రేటు చార్టులు మరియు చెల్లుబాటు అయ్యే సహాయక పత్రాల జాబితా ప్రదర్శన చెయ్యాలి అని ఆదేశించారు. అలాగే డిసిపిఓ/ డిఎస్డబ్ల్యూఓ ని సహాయక పత్రాల ధృవీకరణ మరియు ఆధార్ సంతృప్తతతో పాటు అనాథ వ్యక్తుల కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీను డి.ఎస్.పి లింగయ్య,ఎల్ . డి.యం.విజయ్ కుమార్,ఈ . డి.యం.విజయ్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.