కబ్జాలకు కట్టడేది?

కబ్జాలకు కట్టడేది?

కనిపిస్తే కబ్జా!

బహదూర్ పల్లిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

కార్తికేయనగర్ లో భారీగా
కమర్షియల్ షెటర్లు

ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం, దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న ఏసీపీ

మేడ్చల్, అక్షిత బ్యూరో:

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. ఎంచక్కా కబ్జా చేసేయొచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తి అక్రమ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కొల్లగొట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టే తంతు ఇక్కడ నిర్విఘ్నంగా సాగుతుంది. ప్రభుత్వ భూములు..దుండిగల్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మూణాలు కొనసాగుతున్నాయి. బహదూరపల్లిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది అండతో అక్రమ నిర్మాణాలతో జోరుగా పనులు చేస్తున్నప్పటికీ ఆయా పనులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. వార్తలు రాసినా స్పందించరు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు మౌనం వీడడం లేదు.

మున్సిపాలిటీ నుండి జిహెచ్ఎంసిగా రూపాంతరం చెందిన అధికారుల తీరు మారడం లేదు. బహదూర్ పల్లిలోనీ ప్రైమ్ మార్క్ నిర్మాణ సంస్థ పక్కన ప్రధాన రహదారిని ఆనుకొని రెండు భారీ షెడ్లు, కార్తికేయ నగర్ వద్ద అతి భారీగా కమర్షియల్ షట్టర్ల నిర్మాణం పనులు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైన్ మెన్ కిందిస్థాయి సిబ్బంది చేతివాటం, ఉన్నతాధికారుల ఉదాసీన వైకరితోనే అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.కళ్ళెం వేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమార్కుల తీరుకు కట్టడి లేదు. ఇదిలా ఉంటే నిబంధనలకు విరుద్ధంగా కట్టే భవనాల నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

నోటీస్ లతో కాలయాపన

బహదూర్ పల్లి కార్తికేయ నగర్ వద్ద అనుమతి లేని కమర్షియల్ షెటర్లు, బహుళ అంతస్తు నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అక్రమ నిర్మాణాలపై పలు దినపత్రికలో వార్తాకథనాలు వెలువడడంతో తేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు నోటీసులు అందజేయాల్సింది పోయి, నోటీసుల పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెనుతిరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ప్రభుత్వ భూమిలో బహుళ
అంతస్తుల భవనాలు

బహదూరపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలోని 60 గజాల ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే 58 జీవో అనుమతి పొంది ఉండి,టౌన్ ప్లానింగ్ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అండతోనే అక్రమ నిర్మాణాలంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలపై
చర్యలు తీసుకుంటాం

బహదూరపల్లిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఏసీపీ శ్రీనివాస్ ను వివరణ కోరగా అనుమతి లేని నిర్మాణాలను పరిశీలిస్తున్నామన్నారు. నోటీసులు అందజేసి చర్యలు చేపడుతామన్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking