గర్జించిన గులాబీ సైన్యం

గర్జించిన
గులాబీ సైన్యం

కేసీఆర్ పై రేవంత్
వికృత చేష్టలు !

రోడ్డెక్కిన
గులాబీ శ్రేణులు

మచ్చలేని నేతపై
సిట్ పేరుతో నిందలా!!

ఎల్ బినగర్ బిఆర్ఎస్
సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి

ఎల్ బినగర్, అక్షిత ప్రతినిధి :

చావు నోట్లో తలదూర్చి తెలంగాణ సాధించిన మచ్చలేని నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై రేవంత్ వికృత చేష్టలు తగదని ఎల్ బినగర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం కేసీఆర్ సిట్ విచారణను నిరసిస్తూ మన్సూరాబాద్ డివిజన్ (ప్రస్తుత లెక్చరర్స్ కాలనీ డివిజన్) పరిధిలోని హయాత్ నగర్ ప్రాంతంలో హెచ్ డీఎఫ్ సి బ్యాంక్ ఎదురుగా గులాబీ సైన్యం మెయిన్ రోడ్డెక్కి ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై రాజకీయ కక్షలతో, అక్రమ కేసులో అక్రమ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న వికృత చేష్టలకు నిదర్శనమని దుయ్యబట్టారు.

రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కక్ష రాజకీయాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జరుగుతున్న పుర పోరులో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రసిడెంట్ చెన్నగోని శ్రీధర్ గౌడ్, చంద్రా రెడ్డి, పరమేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి, భాస్కర్ సాగర్, అనిల్ కుమార్, నాగార్జున, చెంగల్ చంద్రమోహన్, పారంద నర్సింగ్, నర్సింహా గౌడ్, మార్కండేయ, జీవన్, వరుణ్ గౌడ్, మనోజ్, వేణు యాదవ్, హరీష్ యాదవ్, సుభాష్, నిఖిల్, రవి, సతీష్, అఖిల్ యాదవ్, సాయి గౌడ్, నితిన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking