విశ్వకర్మ సంఘ నూతన అధ్యక్షుల ఎంపిక…

విశ్వకర్మ సంఘ నూతన అధ్యక్షుల ఎంపిక...

ముఖ్య అతిధి బిఆర్ఎస్ అభ్యర్థి జాం రవి…

మూడుచింతలపల్లి, అక్షిత న్యూస్: 

మూడుచింతలపల్లి మున్సిపల్ విశ్వకర్మ సంఘానికి  నూతన అధ్యక్షునిగా మహంకాళి జహంగీర్ చారి, ఉపాధ్యక్షుడిగా బంగారు వెంకటేష్ చారి, కోశాధికారి మహంకాళి బిక్షపతి చారి, కార్యదర్శి రాళ్ల బండి సంతోష్ చారి, మూడుచింతలపల్లి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మహంకాళి ఆంజనేయులు చారి, మునిగంటి నరసింహ చారి రాళ్ల బండి బిక్షపతి చారి సభ్యులు బి తిరుమల చారి, ఎస్. శ్రీనివాస్ చారి, ఎం రాము చారి, ఎం శ్రీనివాస్ చారి బి శ్రీనివాస్ చారి,బాల చారి, సంతోష్ చారి, మహేష్ చారి, యోగి చారి, మధు చారి, జయసింహా చారి, ఉష కిరణ్ చారీ, రామలింగేశ్వర చారి, అజయ్ చారీ, అరుణ్ కుమార్ చారీ, ఆర్ కృష్ణ చారీ, నరేష్ చారి ఎస్ బిష్మ చారీ, పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూడుచింతలపల్లి మాజీ సర్పంచ్ జాం రవి, మాజీ ఎంపీటీసీ నాగరాజు, ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గంగిశెట్టి గణేష్ బాబు హాజరయ్యారు. జాం రవి మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధి మరియు అన్నదాన కార్యక్రమానికి ఆర్ధికంగా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కార్యవర్గ సభ్యులందరూ జాం రవి కి ధన్యవాదాలు తెలియ చేస్తూ జరగబోయే ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల గెలుపునకు విశ్వకర్మ సంఘం తరఫున మద్దతు ఇస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking