ఇద్దరు విద్యార్థుల కోసం
ప్రభుత్వం బడి
వనపర్తి, అక్షిత ప్రతినిధి :
జపాన్ దేశంలో కేవలం ఒక విద్యార్థి కోసమే తన పాఠశాలకు వెళ్లడం సౌకర్యం ప్రభుత్వం రైలు సౌకర్యాన్ని కల్పించింది.మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నందు కేవలం ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలలో కూడా ఒక ఉపాధ్యాయురాలును కేటాయించి విద్యలో ఆ అమ్మాయికి అసౌకర్యం కలవకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. అదేవిధంగా మన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామంలో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. స్థానిక మండల విద్యాధికారి జయ రాములు ప్రోత్సాహముతో శాఖ పురములో పనిచేస్తున్న ఎస్సీటీ ఉపాధ్యాయుడు కే. నరసింహనాయుడుని జనం పల్లికి డిప్యూటేషన్ పై పంపి పిల్లలకు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రభుత్వం పాఠశాలలో గల మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి వసతులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఏ విధంగా అందుతాయావ్ పర్యవేక్షనించడానికి జిల్లా పర్యవేక్షణ బృందాలను నియమించింది ఈ బృందం శుక్రవారం జనంపల్లి పాఠశాలను సందర్శించిన సమయంలో కేవలం ఇద్దరు విద్యార్థుల కోసం ఒక రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు పార్ట్ టైం స్వీపర్ కూడా నియమించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అని వారి పరిశీలనలో తేలినది. ఈ పరిశీలన బృందంలో గల సభ్యులు మన్య, మురళీకృష్ణ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్ని రికార్డ్స్ ను పరిశీలించడంతోపాటు స్థానిక ఉపాధ్యాయునికి కూడా మెలకువలను అందించడంతోపాటు, విద్యార్థులను బడివైపుకు ఉత్సాహాన్ని పెంచడం కొరకు వారితో ఆటపాటలతో అలరించారు. విద్యార్థులతో కబడ్డీఆటను కూడా ఆడారు. పర్యవేక్షణ బృందాల యొక్క బాధ్యత కేవలం పర్యవేక్షనే కాదు విద్యార్థుల సంఖ్యను పెంచడం అదేవిధంగా ఉపాధ్యాయులకు సరైనటువంటి మార్గ నిర్దేశం చేయడం ఆటపాటలతో విద్యాభ్యాసం ఏ విధంగా చేయాలన్నటువంటి అంశంపై సదరు ఉపాధ్యాయునికి సరైన మార్గనిర్దేశం పర్యవేక్షణ బృందం అందించింది.