పిల్లల భవితకు విద్య కీలకం – కలెక్టర్ బి.చంద్రశేఖర్ 

నల్గొండ, అక్షిత ప్రతినిధి : పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మర్రిగూడ మండలం, సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడి స్కూలును సందర్శించి పిల్లలతో మాట్లాడి చదువు పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకొని, అక్షరాలు– సంఖ్యలు చెప్పిస్తూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, పోషణాహార వివరాలు, హాజరు పరిస్థితి తదితర అంశాలపై అక్కడ ఉన్న అంగన్వాడి ఆయాలతో వివరాలు తెలుసుకున్నారు.  పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య ఎంతో కీలకమని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఏం తిన్నారు? ఏం పెట్టారు? అని అడిగారు. దానికి పిల్లలు సమాధానం చెప్తూ పప్పు పెట్టారు అని చెప్పారు.ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ ,డి ఫర్ డాగ్అని . 1 నుండి 20 వరకు అంకెలు అడిగారు. తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మున్నయ్య , సిపిడిఓ సక్కుబాయి, మునుగోడు సిడిపీవో కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking