- కాంగ్రెస్ తోనే పట్టణ ప్రగతి
- రేవంత్ రెడ్డి నాయకత్వంలో
- కాంగ్రెస్ ఘనవిజయం
- డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత.
నల్గొండ టౌన్, అక్షిత న్యూస్ : గత రెండు సంలుగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ అభివృద్ధి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదు. అభివృద్ధి సంక్షేమం వారి నాయకత్వంలో ముందుకు సాగుతుంది. అప్పులు పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో 70 శాతం పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్ లోన్ సహా ఆరు మున్సిపాలిటీలను కైవనం చేసుకుంటాం. బిఆర్ఎస్ బిజెపికి ఓటు వేస్తే దండగ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. గత రెండు సంవత్సరాలుగా 19 వేల కోట్లు నిధులను పట్టణాలకు ఖర్చు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త సిసి రోడ్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 ఉచిత యూనిట్ల కరెంటు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు ప్రజాపాలనలో అందిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం. బిఆర్ఎస్ బిజెపిలు అక్రమ సంబంధాలతో గెలవాలని చూస్తున్నారు. దయచేసి వారికి ఓటు వేస్తే మురికి కాల్వలో వేసినట్లే. జిల్లాలో బిఆర్ఎస్ బిజెపికి అభ్యర్థులు కరువు అయ్యారు. 2029 సంవత్సరాలో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది. ముఖ్యమంత్రిగా రెండవ సారి రేవంత్ రెడ్డి అవుతారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జలపెల్లి పరమేష్, ఎండి ముంతాజ్ అలీ, భవ్యతేజ్ రెడ్డి, గౌతమ్, రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, శరత్, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.