హ్యాకథాన్
యోగా లో ప్రతిభను చాటిన విద్యార్థులు..
హ్యాకథాన్ యోగలో విద్యార్థుల సాధించినా18 పతకాలు ఆరు బంగారు, ఏడు వెండి అయిదు కాస్యం పథకాలు గెలుచుకున్న విద్యార్థులు..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దూలపల్లి విద్యార్థులకు అరుదైన గౌరవం..
మేడ్చల్, అక్షిత బ్యూరో:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జోన్ కొంపల్లి జిహెచ్ఎంసి సర్కిల్.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూలపల్లి విద్యార్థులు వివిధ కార్యక్రమాలలో ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు యోగా ట్రైనర్ మమత మార్గదర్శకత్వంలో యోగాభ్యాసం అందించబడుతోంది. ఈ శిక్షణ ఫలితంగా ఆదివారం రోజున గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన హ్యాకథాన్ యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని మొత్తం 18 పతకాలు సాధించారు. అందులో 6 బంగారు 7 వెండి, 5 కాంస్య పతకాలు గెలుచుకొని పాఠశాలకు గర్వకారణమయ్యారు.

ఈ సందర్భంగా,విద్యార్థులను శిక్షణ ఇచ్చిన యోగా ట్రైనర్ మమత ని పాఠశాలలో ఘనంగా సన్మానించి విద్యార్థులను అభినందించారు.
ఇటీవల జరిగిన మరో కార్యక్రమంలో పాఠశాల 8వ తరగతి విద్యార్థిని శ్రీలత ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ 90 శాతం కంటే ఎక్కువ హాజరు నమోదు చేసినందుకు ఎస్‌బీఐ సాకారం కార్యక్రమం ద్వారా కలెక్టర్ రేటులో ఒక సైకిల్ బహుమతిగా అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కే.వేణుగోపాల్ గారు ఆమెను అభినందించారు.
అదేవిధంగా వారం రోజుల క్రితం దుండిగల్ మండలంలో నిర్వహించిన మేడ్చల్ జిల్లా మోడల్ పార్లమెంట్ సమావేశంలో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం మరో గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులను మరియు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు.

ఈ సందర్భంగా, ప్రధానోపాధ్యాయులు కే.వేణుగోపాల్ మాట్లాడుతూ,విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, యోగా,సహపాఠ్య కార్యక్రమాలలో ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకి మంచి పేరు తీసుకురావడం ఆనందదాయకమని తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు..