ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన చిన్నారుల కు సన్మానం

ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన చిన్నారుల కు సన్మానం

గ్రామ సర్పంచ్ అవురుచింతల రమేష్

కల్వకుర్తి అక్షిత ప్రతినిధి

తలకొండపల్లి మండల పరిధిలోని మెదక్ పల్లి గ్రామంలో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గ్రామానికి చెందిన దరువుల నరసింహ కూతురు దరువుల పూజ షాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో 1000/986 మార్కులు సాధించి కాలేజ్ లోని రెండవ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచారు. అలాగే శానమోని భూపాల్ కూతురు శానమోని నందిని అధిభట్ల లోని నారాయణ కాలేజ్ లో ఇంటర్ ఎంపీ సి మొదటి సంవత్సరం చదువుతుంది. నిన్న వెలువడిన ఫలితాల్లో 480/466 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే దుగ్గపురం సంతు కూతురు దుగ్గపురం అశ్విత షాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది ఈమెకు 1000/917 మార్కులు సాధించింది.అలాగే దరువుల కృష్ణయ్య కూతురు దరువుల మౌన శ్రీ మహేశ్వరం లోని సోషల్ వెల్ఫేర్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది.ఈమెకు 470/450 మార్కులు సాధించింది. అలాగే దరువుల నరసింహ కూతురు దరువుల శ్రీజ షాబాద్ లోని ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది ఈమెకు 470/447 మార్కులు సాధించింది. అలాగే అల్వాల రాఘవేందర్ కూతురు అల్వాల హిందూ శ్రీ వెల్దండ లోని మోడల్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది ఈమెకు 470/442 మార్కులు సాధించింది. వీళ్ల పై గ్రామ ప్రజలు స్నేహితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాగే గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అలాగే ఇంత మంది మన గ్రామంలో ఉత్తమ ప్రతిభ కనబరచడం ఇదే మొదటిసారి అన్నారు.అనంతరం గ్రామ సర్పంచ్ వీరికి గ్రామ పంచాయతీ దగ్గరకు పిలిపించి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ముందుగా మీ అద్భుతమైన విజయాలకు అభినందనలు తెలుపుతూ కష్టపడి చదవడం ప్రశాంతంగా ఉండటం ఆత్మవిశ్వాసం వంటి వీటిపై దృష్టి సారిస్తూ ప్రోత్సాహకరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు.అప్పుడు మీ విజయాలు భవిష్యత్తు సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఉత్తేజకరమైన సాహసంలో నాంది కావాలని ఎదురుచూస్తుంటాయి.అప్పుడు మీకు తగిన ఫలితం లభిస్తుంది. మీ కృషి మరియు పట్టుదల అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మీ విజయానికి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు మీ కృషి మరియు అంకిత భావం నిజంగా ఫలించాయి. మీరు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుధాకర్ రెడ్డివార్డు మెంబర్ తిప్పిరెడ్డి ప్రభావతి గ్రామ పెద్దలు తిరుమణి విష్ణు గౌడ్ తిరుమణి నరేందర్ గౌడ్ తిక్కల మల్లయ్య శానమోని పర్వతాలు దరువుల రాజు దరువుల నవీన్ దరువుల మల్లేష్ దరువుల నరేష్ దుగ్గపురం మహేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శశికళ రమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking