రామన్నపేటలో గంజాయి తాగుతున్న నలుగురు యువకులు అరెస్ట్

రామన్నపేటలో గంజాయి తాగుతున్న నలుగురు యువకులు అరెస్ట్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

గంజాయి తాగు తున్న నలుగురు యువకులను పట్టుకొని వారినుండి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులోగల ఓ ఫంక్షన్హాల్ వెనుక భాగంలో యువకులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందుకొని పోలీ సులు అక్కడ చేరుకొని నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. వారినుంచి 120గ్రా ముల గంజాయిని, మూడు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కలిగిఉన్న పిల్లి నవీన్, క్రాంతి కుమార్, సూరారం ప్రసాద్, మేడి లోకేశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking