మృతుని కుటుంబానికి సర్పంచ్ లు రూ.10 వేల ఆర్థిక సహాయం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మల్లం కాటం అకాల మరణం చెందడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.5,000, బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బైకానీ ఉమా మహేష్, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత-యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, కాటపల్లి యాదయ్య, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, కాటపల్లి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, కునూరు మహేష్, మేడి కృష్ణ, ఎండి వాజిద్, కొప్పుల శంకర్, మెట్టు సైదులు, గర్ధాస్ సాయి, మేకల నరేష్, నీరుడు నరేష్, మంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.