ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి

– వనం ఉపేందర్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

ఈ నెల 24న భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగే ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు. మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. జిల్లాలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, అంత్యోదయ రేషన్ కార్డుతో 35 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.కార్యక్రమంలో మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, ఉపాధ్యక్షుడు నాగు నరసింహ, సహాయక కార్యదర్శి పున్న శ్రీధర్, నాయకులు కుందూరు వెంకటేశం, పున్న సదానందం, వంగాల నరసింహ, పగిల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking